Price: ₹150.00
(as of Jan 10, 2025 16:36:16 UTC – Details)
పాణినిగారి కథల్లాంటి ప్రామాణికమైన, విభిన్న తరహా కథల్ని మొదటి కొద్ది నెలల్లోనే వ్రాసిన రచయితలు అత్యంత అరుదుగా ఉంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రతి కథకూ ఎంతసేపు ఆలోచిస్తారో, ఎంత కసరత్తు చేస్తారో కానీ ఒక్కో కథా పరిపూర్ణతను సంతరించుకుని పాఠకుడ్ని చేరుతోంది. పాణిని గారిని తెలుగు కథా సాహిత్యంలో స్థిరంగా, ప్రామాణికంగా ఎదుగుతున్న రచయిత అనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సంపుటిలోని కథాంశాల వైవిధ్యాన్ని, రచనా శిల్పాన్ని గమనిస్తే ఆయనకి కథా రచయితగా మహోజ్వలమైన భవిష్యత్తు ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. – కిరణ్ ప్రభ కౌముది.కామ్ సంపాదకులు కథ, కథనం కొత్తగా ఉన్నాయి. వస్తువు ఎంపిక, ఆలోచన, విశ్లేషణలో తనదైన ప్రత్యేక శైలి కనిపిస్తోంది. ముఖ్యంగా ‘మరో కురుక్షేత్రం’, ‘గుప్పునున్న నోట్లు’, ‘తనలో నన్ను’ కథలు రచయిత పరిణితిని సూచిస్తున్నాయి. ‘ఏయిత్ సిన్’ కథ రచయితలోని తాత్విక దృష్టిని పట్టిస్తోంది. ఆధునిక జీవితం, మానవ సంబంధాలు, టెక్నాలజీ వంటి అంశాలు రచయిత కథా వస్తువులు అయ్యాయి. ఏదో ఒక అంశానికో, వాదానికి సంబంధించి కాకుండా అన్ని రకాల కథలు చదవగోరే వారికి మంచి పుస్తకం. ఈ పుస్తకంతో రచయిత బాగా రాస్తున్న ఇప్పటి కథకుల లిస్టులో చేరుతుండటం అన్కరం కలిగించే విషయం. కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్
ASIN : B0B38LZ9MJ
Publisher : Anvikshiki Books (1 January 2022)
Language : Telugu
Perfect Paperback : 140 pages
Reading age : 10 years and up
Country of Origin : India